శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ నిత్యాన్నదాన సేవా సమితి

  ఆరాధన ఉత్సవములు మే-2024


శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆశయాలకు అనుగుణంగా ఈ సేవాసమితి స్ధాపించబడినది. ప్రారంభదశలో శ్రీ స్వామివారి ఆరాధనోత్సవాలు విచ్చేయు భక్తులకు ఈ సేవాసమితివారు కుల-మత భేదం లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించుచున్నారని భక్తులకు సవినయముగా మనవి చేస్తున్నాము.

      "నాస్తి అన్నదాన సమం దానం అన్నేనసదృశం దానం న భూతో న భవిష్యతి " అనే మహర్షుల సూక్తులను అనుసరించి కందిమల్లాయపల్లెలోని శ్రీ స్వామివారి సజీవసమాధిని దర్శించి - తరించుటకై వచ్చు భక్తులకు కుల-మత-భేదం లేకుండా ప్రతినిత్యము రెండు పూటలా అన్నసంతర్పణ జరుగుచున్నది .

     నిత్యాన్నదానముకై దాతలు - భక్తులు - చెల్లించు విరాళములను పైన వచ్చు వడ్డీ ధనముతో దాతకోరిన రోజున అన్నదానము జరుపబడునని విన్నవించుచున్నాము.